Wednesday, July 29, 2020

హ్యాపీ బర్త్ డే సోనూ సూద్: సినిమాల్లో విలన్.. రియల్ లైఫ్‌లో అసలు సిసలైన హీరో.. శుభాకాంక్షల వెల్లువ

కరోనా విలయతాండవం చేస్తున్న ఈ ఆపత్కాల సమయంలో మానవత్వం చాటుకుంటూ అందరికీ అండగా నేనున్నా అనే భరోసా కల్పిస్తున్నారు నటుడు . ఆయనను సినిమాల్లో విలన్ గానే చూశాం కానీ రియల్ లైఫ్‌లో మాత్రం అసలు సిసలైన హీరో అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న ఈ రియల్ హీరో పుట్టిన రోజు ఈ రోజు (జులై 30). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. 1973 సంవత్సరం జులై 30వ తేదీన జన్మించిన సోనూ సూద్ నేటితో 46 సంవత్సరాలు పూర్తిచేసుకొని 47వ యేట అడుగు పెడుతున్నారు. ఆపత్కాలంలో ఆదుకుంటున్న ఆపద్బాంధవుడిగా కీర్తించబడుతున్న ఆయన.. తన పుట్టిన రోజు సందర్భంగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కొవిడ్-19 నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటూ దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభిస్తున్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందనున్నట్లు ఆయన పేర్కొన్నారు. Also Read: మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. ఇక ఇటీవలే చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతుకు ట్రాక్టర్ కొనిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఉద్యోగం ఇప్పించారు. ఇలాంటి ఎన్నో మంచి పనులతో రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకుంటున్న సోను సూద్‌కి మీ మా 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నాం. హ్యాపీ బర్త్ డే సోనూ సూద్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fcMt2K

No comments:

Post a Comment

This AI tool helps content creators block unauthorized scraping and manage bot interactions

Cloudflare AI Audit offers analytics to track and monetize content usage Creators regain control with automated tools and fair compensat...