ప్రస్తుతం 'రాధేశ్యామ్' మూవీ చేస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమాను 'మహానటి' ఫేమ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించడంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతూ బిజీ బిజీగా ఉన్న దీపికాకు తెలుగులో ఇదే మొదటి సినిమా కానుంది. అయితే దీపిక లాంటి బిగ్ హీరోయిన్ ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి ఓకే చెప్పడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో చేసేందుకు దీపికా పదుకొనే తీసుకుంటున్న రెమ్మ్యూనరేషన్ తాలూకు సంగతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ మూవీ కోసం దీపికకు భారీ ఆఫర్ ఇచ్చారని, ఏకాంగా ఆమెకు 25 కోట్ల రూపాయలు ఇస్తుండటం కారణంగానే ఈ సినిమాకు సైన్ చేసిందని టాక్ నడుస్తోంది. హిందీలో ఆమె ఒక్కో చిత్రానికి 15 కోట్లకు కాస్త అటూ ఇటూగా తీసుకుంటున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. సో.. హిందీ కంటే దాదాపు 10 కోట్ల మేర ఎక్కువిస్తున్నారంటే ఈ సినిమాలో దీపిక రోల్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు నాగ్ అశ్విన్ తెలిపారు. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అతి త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మూవీ సాంకేతిక బృందం ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f4A5lc
No comments:
Post a Comment