సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకరి తర్వాత ఒకరు బాలీవుడ్ ఇంస్ట్రీకి సంబంధించిన విషయాల్ని బయట పెడుతున్నారు. తాజాగా ఆస్కార్ అవార్డ్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ గ్యాంగ్ తనకు , తన దగ్గరకి వచ్చే వాళ్లకి మధ్య దూరం పెంచుతుందన్నారు. అందుకే దక్షణాదిలో కన్నా హిందీలో తక్కువ సినిమా ఆఫర్స్ వస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సుశాంత్ చివరి చిత్రం అయిన దిల్ బేచారకు రెహమాన్ సంగీతం అందించారు. ఆ సినిమా దర్శకుడు ముఖేష్ చాబ్రా తన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయనకు కూడా తన విషయంలో ఎన్నో చెప్పారన్నారు. కానీ ముఖేష్ చాబ్రాకు కేవలం రెండు రోజుల్లోనే ట్యూన్స్ ఇచ్చానన్నారు. అయితే... ముఖేష్ మాటల తర్వాత తనకు చాలా విషయాలు అర్థమయ్యాయన్నారు. ఇంతకాలం హిందీలో తనకు ఎందుకు తక్కువ సినిమాలు వస్తున్నాయో కూడా తెలిసిందన్నారు. ఓ గ్యాంగ్ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తనకు తన దగ్గరికి వచ్చే వారికి మధ్య దూరం పెంచుతున్నారు అని రెహమాన్ పేర్కొన్నారు. Read More: అయితే అవన్నీ తాను పట్టించుకోనున్నారు రెహమాన్. విధిని మాత్రమే తాను నమ్ముతానన్నారు. దేవుడే తనకు అంతా మంచి చేస్తాడని విశ్వసిస్తానన్నారు. అందరు తనని కలవవచ్చన్నారు. తన నుంచి మంచి ట్యూన్స్ కూడా రాబట్టొచ్చు... అందరికి స్వాగతం అంటూ రెహమాన్ పేర్కొన్నారు. హిందీలో 'దిల్ సే', 'తాళ్', 'లగాన్', 'స్వదేశ్', 'రంగ్ దే బసంతి', 'గురు', 'రాక్‌స్టార్', 'తమాషా', 'ఓకే జాను' తదితర హిందీ చిత్రాలకు సంగీతద ర్శకుడిగా పని చేశారు రెహమాన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OXmstu
No comments:
Post a Comment