Saturday, July 25, 2020

Green India Challenge: ఈ పనితో ప్రకృతికి మేలు చేసిన వాళ్ళమవుతాం.. స్మిత, నానిలకు అల్లరి నరేష్ సవాల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమవుతున్నారు. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు. Also Read: ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన సవాల్ స్వీకరించి ఫిలింనగర్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు హీరో . అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతికి మేలు చేసిన వాళ్ళమవుతామని చెప్పారు. హీరో , సింగర్ , డైరెక్టర్ దేవా కట్ట ముగ్గురికీ సవాల్ విసురుతున్నట్లు పేర్కొన్నారు అల్లరి నరేష్. 2002 సంవత్సరం 'అల్లరి' సినిమాతో తన వెండితెర ప్రయాణం మొదలుపెట్టిన నరేష్.. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అన్నట్లుగా కీర్తి గడించారు. ఇటీవలే మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో ఓ విలక్షణ పాత్రలో నటించిన అల్లరి నరేష్.. ప్రస్తుతం ‘నాంది’ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CRkRTw

No comments:

Post a Comment

Someone finally tested China's x86 CPU answer to AMD and Intel — the 8-core Zhaoxin KX-7000 processor is promising, but can't reasonably compete for now

The 8-core Zhaoxin KaiXian KX-7000 processor, China’s latest entry into the x86 CPU market, was recently put through its paces by PC Watch ...