Tuesday, July 7, 2020

Ram Charan: పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ కాంబోలో మూవీ.. మెగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్!

ఓ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే మరోవైపు వరుస సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ . రాజకీయ రంగంలో అడుగుపెట్టాక కేవలం రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఆయన తిరిగి కెమెరా ముందుకొచ్చేశారు. ఇక హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. హీరోగా భారీ హిట్స్ ఖాతాలో వేసుకుంటూనే నిర్మాతగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరి కాంబోపై మెగా అభిమానులు మురిసిపోయే ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న రామ్ చరణ్.. తన తదుపరి సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఈ ప్రకటన కోసం మెగా అభిమాన లోకం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌‌ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో చేతులు కలపనున్నారని ఫిలిం నగర్‌లో బలమైన టాక్ వినిపిస్తోంది. Also Read: రామ్ చరణ్ నటించబోయే తదుపరి చిత్రానికి పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తి రేపుతోంది. ఈ మధ్యే త్రివిక్రమ్ శ్రీనివాస్- రామ్ చరణ్ భేటీ జరిగిందని, ఆయన చెప్పిన కథపై చెర్రీ ఆసక్తి కనబర్చారని విశ్వనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ పూర్తయ్యాకే చరణ్- త్రివిక్రమ్ కాంబో సెట్స్ మీదకు వస్తుందని, ఈ లోగా అటు పవన్ కూడా తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసుకొని.. ఈ మూవీ నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టేలా ప్రణాళికలు రచించుకున్నారని సమాచారం. ఏది ఏమైనా బాబాయ్- అబ్బాయ్ కాంబోలో సినిమా అంటే మెగా అభిమానులకు అంతకుమించిన స్పెషల్ ట్రీట్ ఇంకేముంటుంది చెప్పండి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38J2Tyk

No comments:

Post a Comment

Good news, I found the cheapest large-capacity PCIe Gen4 SSD per TB - bad news, it will cost you more than $58,300

Want the cheapest large capacity PCIe Gen4 SSD per TB? You’ll need to buy ten of Solidigm’s D5-P5336 61.44TB SSD monsters. from Latest fro...