క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది . అక్కగా, అమ్మగా, భార్యగా ఎన్నోసినిమాల్లో నటించిన ఆమె టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లోకెల్లా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న సురేఖా.. సోషల్ మీడియాను మాత్రం దున్నేస్తోంది. తన కూతురు సుప్రితతో కలిసి డాన్సులేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియా వాల్స్‌పై పోస్ట్ చేస్తుండటంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆమెను బిగ్ బాస్‌లో తీసుకొని ఆ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయింది. సురేఖావాణి కూతురు సుప్రిత తన పుటిన రోజు సందర్భంగా ఓ లైవ్‌లో పాల్గొని తన కుటుంబ విషయాలు, గోల్స్, పెళ్లి, ఫ్యూచర్ ప్లాన్స్ తదితర అంశాలపై ఆసక్తికరంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఈ సారి రాబోతున్న బిగ్ బాస్‌లో సురేఖావాణి సందడి చూడబోతున్నాం అంటున్నారు నిజమేనా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఏమో నాకైతే తెలియదు? మా అమ్మ నాతో చెప్పలేదు అంటూ సమాధానాన్ని దాటవేసింది. దీంతో బిగ్ బాస్ 4లో సురేఖావాణి ఉండబోతోందనే దానిపై జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. Also Read: ఇక ఈ లైవ్‌లో తన పెళ్లి విషయమై కూడా రియాక్ట్ అయిన సుప్రిత.. ప్రస్తుతం తన వయసు 20 మాత్రమే అని, అయినా అప్పుడే పెళ్ళెప్పుడు చేసుకుంటావ్ అని అంతా అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చింది. తనకు కాబోయే వాడు అందగాడు కాకున్నా పర్వాలేదు గానీ తనను అర్థం చేసుకొని సంతోషంగా గడిపేవాడు కావాలని చెప్పింది. దీంతో ఈ లైవ్ చాట్ చూసిన నెటిజన్లు 'సుప్రిత అప్పుడే కాబోయేవాడిపై కన్నేసిందండోయ్.. మరి ఇంకెందుకు ఆలస్యం వేట ప్రారంభించు' అంటూ సరదా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jrrXy3
No comments:
Post a Comment