కరోనా వైరస్‌తో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న దిగ్గజ గాయకుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. అలాగే, బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులకు ఆయన స్పందిస్తున్నారని, ఇంకా వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స కొనసాగుతోందని సమాచారం. బాలు ఆరోగ్యంపై శనివారం ఎంజీఎం హాస్పిటల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, హాస్పిటల్ వర్గాల ద్వారా బాలు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం బయటికి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యంకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కొన్ని రోజులుగా జరుగుతోందని, ఫిజియోథెరపీకి బాలు శరీరం సహకరిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. మరోవైపు, తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన తండ్రి మెల్లమెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. ఇక శనివారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నాన్న నిన్నటి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. నాన్న ఆరోగ్యం గురించి ప్రస్తుతానికి కొత్త అప్‌డేట్ ఏం లేదు’’ అని చరణ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ తరవాత వెంటిలేటర్‌తో పాటు ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b6vqiv
No comments:
Post a Comment