Saturday, August 29, 2020

కాంబినేషన్ సెట్ అయ్యింది.. పవన్ కోసం మళ్లీ ఒక్కటైన ఇద్దరు దర్శకులు!

సినీ రచయిత వక్కంతం వంశీ ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందు ఆయన పలు చిత్రాలకు కథలు అందించారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి వంశీ ఎక్కువగా పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్’, ‘రేసుగుర్రం’ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు పవర్ స్టార్ కోసం సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ మరోసారి కలిసి పనిచేయనున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఖరారైందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. వక్కంతం వంశీ రాసిన కథతో ఈ సినిమా రూపొందబోతోంది. ఎస్‌.ఆర్‌.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాను ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్ వరుసగా సినిమాలు చేయనున్నారు. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2న ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నివేదా థామస్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ‘మగువా’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. థియేటర్లు తెరుచుకున్న తరవాత ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jli70m

No comments:

Post a Comment

Adding Google Gemini to Samsung's Ballie AI robot sounds impressive, but I'm not sure it matters

I’ve watched enough robot videos online to know that slapping an AI model into a hunk of hardware doesn’t automatically make it useful. I r...