ప్రేమించడంలో నయనతారకు కావాల్సినంత సీనియారిటీ ఉంది. అదెలాగో మీ అందరికీ తెలుసు. కెరీర్ ఆరంభంలోనే శింబుతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. ఆ ఇద్దరితో కట్ చేసుకున్నాక యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ ఎఫ్ఫైర్ స్టార్ట్ చేసింది నయన్. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ఫుల్లుగా ప్రేమలో మునిగితేలుతూ డేటింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్ళైతే కాలేదు కానీ.. భార్యభర్తల కంటే ఎక్కువ అన్యోన్యంగా నయన్, విఘ్నేష్‌లు కలిసి జీవిస్తుండటం మన కంట పడుతూనే ఉంది. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి షికార్లు కొట్టడమంటే నయన్‌కి మహా సరదా. ఇప్పటికే ఈ ఇద్దరికీ సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఈ ఏడాది చివర్లో నయన్- విఘ్నేష్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి. దీంతో త్వరలోనే వీళ్ళ బ్యాచిలర్ లైఫ్‌కి అదేవిధంగా ప్రేమ ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పడనుందని అంతా ఫిక్సయ్యారు. ఈ పరిస్థితుల్లో తాజాగా పెళ్లిపై విఘ్నేష్ శివన్ రియాక్ట్ అయిన తీరు జనాల్లో హాట్ టాపిక్ అయింది. Also Read: నయన్‌తో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. ''మా పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు షికారు చేశాయి. ఒకరకంగా చెప్పాలంటే మీడియా ఇప్పటికే ఎన్నోసార్లు మా పెళ్లి చేసేసింది కూడా. అయితే వృత్తిపరంగా మేము సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అందుకే పెళ్లి విషయంలో తొందరపడటం లేదు. ప్రస్తుతం మా ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే.. మాకు డేటింగ్ లైఫ్‌పై బోర్ కొడితేనే పెళ్లి గురించి ఆలోచిస్తాం'' అని అన్నాడు. దీంతో ముచ్చటగా మూడోసారైనా నయన్ ప్రేమలో గెలుస్తుందా? లేక మళ్ళీ పాత పాటేనా.. అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CYqDmu
No comments:
Post a Comment