తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో నటుడ్ని కోల్పోయింది. గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ ఎర్రగడ్డ రాజీవ్ నగర్ కాలనీలోని గ్రీన్ పార్కు రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో మంచాల నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె కూడా ఉన్నారు. శనివారం ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ లోపే ఆయన మృతి చెందారు. ఎన్నో సినిమాలతో పాటు.. నాటకాలు,టీవీ సీరియల్స్‌లో కూడా తన నటనతో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంచాల సూర్యనారాయణ. మూడు రోజుల కిందట ఆయన సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నట్లు కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. రుతురాగాలు, ఆడది సీరియళ్లలో నటించారు. ప్రస్తుతం మనసు మమత, వదినమ్మ, రామసక్కనిసీత వంటి సీరియల్స్‌లో మంచాల నటిస్తున్నారు. ‘వివాహభోజనంబు’ చిత్రంతో సినిమాల్లో తెరంగేట్రం చేశారు. వీరరాజమ్మ, పెదవెంకటరాజు దంపతులకు 1948 జనవరి 1వ తేదీన కాకినాడ దగ్గరున్న తిమ్మాపురంలో సూర్యనారాయణ జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం తిమ్మాపురం, కాకినాడలో జరిగింది. ఆయన గొప్ప స్నేహశీలి అని ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శశాంక్ కీర్తించారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ.. ఎర్రగడ్డ శ్మశానంలో మంచాల అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39r1Kf9
No comments:
Post a Comment