సంచలన దర్శకుడు మరోసారి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎవ్వరైతే తనను తిట్టారో వారిచేతనే హాట్సాఫ్ అనిపించుకున్నారు. ఇదంతా మనం చెప్పడం కాదు.. వీడియో ప్రూఫ్‌తో సహా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరి ముందుంచారు ఆర్జీవీ. ఆయన రూపొందించిన '' సినిమా విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఏంటో డైరెక్టుగా చూపించి మరోసారి ఇష్యూని హాట్ టాపిక్ చేశారు వర్మ. పవర్ స్టార్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అవుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సినిమా ప్రమోషన్స్ కోసమై ఆయన విడుదల చేసిన పోస్టర్స్, ట్రైలర్ చూసి మరింత రగిలిపోయారు. చివరకు వర్మ ఆఫీసుపై కూడా దాడి కూడా చేశారు. కానీ 'పవర్ స్టార్' మూవీ విడుదల తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఏ పవన్ ఫ్యాన్స్ అయితే వర్మను పిచ్చోడు, మెంటలోడు అని తిట్టారో ఆ ఫ్యాన్సే ఇప్పుడు హాట్సాఫ్ ఆర్జీవీ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ 'పవర్ స్టార్' సినిమాపై పవన్ ఫ్యాన్స్ రివ్యూ అని పేర్కొంటూ రిలీజ్ తర్వాత కూడా తన సినిమాను మరోసారి చర్చల్లో నిలిచేలా చేశారు వర్మ. Also Read: ఇక ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు.. 'పవర్ స్టార్' సినిమాపై ప్రశంసలు గుప్పించడం చూడొచ్చు. సినిమా స్టార్ట్ అయ్యాక మొదటి 25 నిమిషాలు ఆర్జీవీని బండ బూతులు తిట్టుకున్న మేము.. చివరి 10 నిముషాలు చూసి పవన్ కళ్యాణ్ నిజమైన ఫ్యాన్ అంటే ఆర్జీవీ అని ఫిక్సయ్యామంటూ వాళ్ళు చెప్పడం గమనించవచ్చు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు నిజమే అంటుంటే, ఇంకొందరు ఇలాంటివి అస్సలు నమ్మొద్దు.. ఇవన్నీ వర్మ జిమ్మిక్కులే అంటూ కామెంట్ చేస్తున్నారు. ''పవన్ కళ్యాణ్ అభిమానులారా ఈ మాటలు నమ్మకండి. ఆ సినిమలో కొన్ని సీన్లు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. లాస్ట్ 10 నిముషాలు RGV చాలా తెలివిగా నటించాడు. పవన్ కళ్యాణ్ ఎదురుగా కూర్చొని వోడ్కా తాగుతూ సిగెరట్ తాగుతూ.. వాడే నాకు సిగెరట్ అలవాటు లేదు అని చెప్పాడు. అలాగే గోవింద గోవింద పాట ఎందుకు?'' అని కామెంట్ పెట్టాడు ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OVItsJ
No comments:
Post a Comment