2020 ఆరంభం నుంచే చిత్రసీమను పలు విషాద వార్తలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో పలువురు సినీ ప్రముఖుల మరణాలు తీవ్ర శోకాన్ని మిగుల్చుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోకముందే మరో విషాదం చూడాల్సి వస్తోంది. గత 6 నెలల్లో చిత్ర పరిశ్రమ పలువురు ప్రముఖ తారలను కోల్పోయింది. కాగా తాజాగా బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పర్వేజ్‌ఖాన్ కన్నుమూయడంతో మరోసారి బాలీవుడ్ సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పర్వేజ్‌ఖాన్(55) గుండెపోటుతో గత రాత్రి మృతి చెందారు. చాతినొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారని బాలీవుడ్ వర్గాల సమాచారం. 35 సంవత్సరాల పాటు చిత్రసీమకు సేవలందించిన .. తన కెరీర్‌లో మొత్తం 56 చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1986లో సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన 2004లో ఇండిపెండెంట్ యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. Also Read: షాహిద్, సోల్జర్, బాజీగర్, బుల్లెట్ రాజా తదితర చిత్రాలకు పర్వేజ్ యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీరామ్ రాఘవన్‌తో కలిసి జానీ గద్దర్, ఏజెంట్ వినోద్, బద్లాపూర్, అంధధుంజధ్ వంటి చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. పర్వేజ్‌ఖాన్‌కు భార్య, కొడుకు, కోడలు, మనవరాలు ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f5kAtr
No comments:
Post a Comment