Thursday, September 3, 2020

Chiranjeevi: చిరంజీవి కొత్త సినిమాపై పవన్ కళ్యాణ్ క్లియర్ హింట్.. అసలు విషయం బయటపడిందిలా!

చిరంజీవి- మూవీ కన్ఫర్మ్. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్లుగా చెక్కర్లు కొడుతున్న వార్త. దానికి కారణం సోదరుడు పవన్ కళ్యాణే. గత నెల రోజుల నుంచే నుంచే మెహర్ రమేష్- చిరంజీవి కాంబోలో కొత్త సినిమా రానుందనే వార్తలు వస్తున్నాయి కానీ అది ఎంతవరకు సాధ్యపడొచ్చు అనే కోణంలో చర్చించుకున్నారు జనం. అయితే తాజాగా ఆ చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోందని క్లియర్ హింట్ ఇచ్చారు పవర్ స్టార్ . కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో 'ఆచార్య' మూవీ చేస్తున్న ఆయన ఆ తర్వాత లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నారు. ఇక ఆ వెంటనే మెహర్ రమేష్‌తో చిరంజీవి సినిమా పట్టాలెక్కనుందని వార్తలు విన్నాం. కాకపోతే ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ అనేసరికి ఎవ్వరికీ నమ్మశక్యం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ చేసిన ట్వీట్‌తో చిరంజీవి- మెహర్ రమేష్ మూవీ కన్ఫర్మ్ అని తేలిపోయింది. Also Read: తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మెహర్ రమేష్‌కి రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ''చిరంజీవి గారితో మీరు చేయబోతున్న సినిమాకు ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. దీంతో చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోపై ప్రేక్షకుల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఈ సినిమాకు కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో సినిమా చేయాల్సిందిగా చిరంజీవిని ఆయనే ఒప్పించారని టాక్. ఏదేమైనా పవన్ ఇచ్చిన హింట్‌తో మెగా అభిమానుల్లో ఉన్న సందిగ్దానానికి తెరపడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z3Mzof

No comments:

Post a Comment

Quordle today – hints and answers for Friday, October 11 (game #991)

Quordle was one of the original Wordle alternatives and is still going strong now nearly 1,000 games later. It offers a genuine challenge, ...