Wednesday, September 2, 2020

V: వావ్! సూపర్ ఆఫర్ ఇచ్చిన నివేదా థామస్.. మీతో మీట్ అది కూడా మీ ఇంట్లోనే అంటూ మెసేజ్

ప్రీ రిలీజ్ ఈవెంట్.. అబ్బ! ఈ మాట విని ఎన్ని రోజులైంది.. ఆ హంగామా మిస్ అయి ఎన్ని నెలలైంది. ఇదే కదా మీ ఫీలింగ్. ఎస్ అదే వాస్తవం కూడా. కరోనాకు ముందు పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు. లాక్‌డౌన్ ముందు ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ హీరోలను గెస్టులుగా పిలిచి ప్రీ రిలీజ్ హంగామా చేసేవారు. కానీ లాక్‌డౌన్ వచ్చి ఆ వినోదంపై దెబ్బేసింది. థియేటర్స్ బంద్ కావడం, ఓటీటీ వేదికలపై సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఓ మెమోరీగానే మిగిలింది. అయితే తమ సినిమా ప్రీ రిలీజ్ హంగామా మిస్ అయ్యామనే లోటు ఉండకూడదని భావించిన V మూవీ యూనిట్ కాస్త వినూత్నంగా ఆలోచించి ఆన్‌లైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. తాజాగా ఆ వివరాలు ప్రకటిస్తూ ఆసక్తికరంగా ట్వీట్ చేసింది చిత్ర హీరోయిన్ . ''మీరు మేము సెప్టెంబర్ 4న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలుద్దాం.. మీతో మీట్ అది కూడా మీ ఇంట్లోనే'' అని పేర్కొంది నివేదా. సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు మీ మీ స్క్రీన్‌పై కలుద్దామని ఆమె మెసేజ్ చేసింది. Also Read: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు సమర్పణలో తెరకెక్కిన ఈ V సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. నాచురల్ స్టార్ , సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు. 'సైరా నరసింహా రెడ్డి' ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. సెప్టెంబర్ 5న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jTfNhF

No comments:

Post a Comment

This is the fastest portable SSD right now — OWC launches a Thunderbolt 5 solid state drive that can exceed 6GB/s, 2x faster than the next quickest external SSD

Other World Computing (OWC) has announced the release of its Envoy Ultra Thunderbolt 5 SSD, available for pre-order now. This new SSD is ...