తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతోంది కన్నడ భామ . ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన రష్మిక.. బన్నీ సరసన ‘పుష్ప’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుండగా.. ఈలోగానే మరో సినిమాలో అవకాశం దక్కించుకుంది. హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమా రష్మికను ఫైనల్ చేశారు. ఇటీవలే ఆ యూనిట్‌తో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకుంది రష్మిక. Also Read: అయితే ఈ సినిమాలో నటించేందుకు రష్మిక భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సోషల్‌మీడియాలో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.1.20కోట్లు డిమాండ్ చేసిందన్న వార్తలతో ఫిల్మ్‌నగర్ వర్గాలు షాక్‌కు గురవుతున్నాయి. కరోనా కష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్లలో కోత విధించాలని ఇండస్ట్రీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ టైమ్‌లో రష్మిక భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందన్న వార్త షాకింగ్‌కు గురిచేస్తోంది. అయితే ఇది కేవలం సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. దీనిపై యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34w7raN
No comments:
Post a Comment