Saturday, October 31, 2020

తొలిసారి ఆయనను అక్కడే కలిశా..! బ్రేక్ ఇవ్వడానికి కారణమిదే: పూజా హెగ్డే

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇటీవలే అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురములో’ సినిమా చేసి బుట్టబొమ్మగా కీర్తించబడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సరసన చిందేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. 2016 సంవత్సరంలో ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్‌ తెరపై కూడా అడుగుపెట్టారు. ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో బాలీవుడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం తెలుగు తెరపై సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై రియాక్ట్ అవుతూ తన ఫీలింగ్స్ బయటపెట్టారు పూజా. సినీ నటులు అన్నాక తొలి సినిమాను చాలా కీలకంగా భావిస్తుంటారని, తనను బాలీవుడ్ మొదటి సినిమా ‘మొహంజోదారో’ డిజాస్టర్ భాధ పెట్టిందని పూజా హెగ్డే తెలిపారు. ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో తన గుండె పగిలినంత పనైందని ఆమె చెప్పారు. అందుకే కొంతకాలం బాలీవుడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చానని, ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలతో మూడేళ్ల తర్వాత రెండో సినిమా ‘హౌస్‌ఫుల్‌ 4’తో సక్సెస్ సాధించి తృప్తి చెందానని ఆమె పేర్కొన్నారు. Also Read: టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నా బాలీవుడ్ తెరకు మూడేళ్ల గ్యాప్ ఇచ్చిన పూజా.. తిరిగి 2019 లో ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాలో నటించారు. మళ్ళీ ఇప్పుడు ర‌ణ‌వీర్ సింగ్‌తో క‌లిసి 'స‌ర్క‌స్' అనే కామెడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కాగా రోహిత్ శెట్టి సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు పూజా. కొన్నేళ్ల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో తొలిసారి రోహిత్‌ శెట్టిని కలిశానని.. ఇప్పుడు ఆయన సినిమాలోనే నటించే అవకాశం రావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నానని పూజా పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో కలిసి 'రాధేశ్యామ్‌' చిత్రంలో అలాగే అక్కినేని అఖిల్‌తో క‌లిసి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TJDxtw

No comments:

Post a Comment

This Chinese chip giant is boosting production to try and take on Nvidia - but how will Huawei feel?

Cambricon aims to triple AI chip output in 2026 despite yield issues, resource shortages, and rising competition from Huawei. from Latest ...