ఫేస్‌బుక్ ద్వారా నటితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమె పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో దారుణానికి పాల్పడ్డాడు. రాత్రివేళ ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ముంబయిలోని వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్ వద్ద సోమవారం రాత్రి 9 గంటల సమయంలో చోటుచేసుకుంది. మాల్వీ మల్హోత్రా ‘ఉడాన్’, ‘హోటెల్ మిలాన్’ టీవీ షోలతో మంచి గుర్తింపు పొందింది. మరోవైపు కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి బాలీవుడ్‌లో నిర్మాతగా కొనసాగుతున్నారు.
వీరిద్దరికి ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తర్వాత మాల్వీని పెళ్లి చేసుకుంటానని కుమార్ ప్రపోజ్ చేయగా ఆమె తిరస్కరించింది. అప్పటి నుంచి కుమార్ వేధింపులకు పాల్పడుతుండటంతో మాల్వీ అతడిని దూరం పెట్టింది. ఈ క్రమంలోనే సోమవారం కారులో వెళ్తున్న అతడికి కేఫ్ సమీపంలోని నడుచుకుంటూ వెళ్తున్న మాల్వీ కనిపించింది. దీంతో ఆమెను అడ్డగించిన కుమార్.. తనను ఎందుకు దూరం పెట్టావు, ఎందుకు మాట్లాడటం లేదంటూ నిలదీశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహానికి గురైన కుమార్.. కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. స్థానికులు ఆమెను వెంటనే కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఆమె పొట్ట భాగంలో, చేతులపై గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం)తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెర్సోవా పోలీస్‌స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఠాకూర్ తెలిపారు. Also Read:from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31PzGPN
No comments:
Post a Comment