యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ''. ‘బాహుబలి’ రెండు పార్ట్‌ల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాతో విడుదలైనా ఆశించినంగా అలరించలేకపోయింది. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. తెలుగు సహా ఇతర భాషల్లో విజయం సాధించలేదు. చివరికి దసరా సందర్భంగా బుల్లితెరపై ప్రసారం చేయగా అక్కడా భారీ షాకిచ్చింది.
వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం టీవీలో అయినా రికార్డులు క్రియేట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు భావించారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ అక్కడా బోల్తా పడింది. ఆదివారం జీటీవీలో వరల్డ్ ప్రీమియర్ షోగా ప్రసారం చేసిన ఈ సినిమా వచ్చిన టీఆర్పీ రేటింగ్ కేవలం 5.8 మాత్రమే. చిన్నహీరోల పాత సినిమాలు మళ్లీ మళ్లీ ప్రసారం చేసినా 3-5 టీఆర్పీ రేటింగులు వస్తుంటాయి. అలాంటిది పాన్ ఇండియ స్టార్ ఎదిగిన సినిమా తొలిసారి టీవీలో ప్రసారం చేస్తే పట్టించుకున్న ప్రేక్షకులే లేరు. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూడోసారి ప్రసారం చేస్తే 11కి పైగా రేటింగ్ వచ్చింది. అలాంటిది సాహో తొలిసారి టెలికాస్ట్ చేస్తే 6కంటే తక్కువ రావడం నిజంగా షాకింగ్ విషయమే. from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J9nOBJ
No comments:
Post a Comment