తెలుగు సినీ పరిశ్రమలో పౌరాణికం, జానపదం, రాజరికం.. ఇలా ఏ పాత్ర గురించి చర్చ వచ్చినా నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుకోవాల్సిందే. ఏ తరహా పాత్ర అయినా ఆయన పరకాయ ప్రవేశం చేసేశారు. అదే కోవలో తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు . తండ్రిలాగే ఆయనకు కూడా పౌరాణిక పాత్రలంటే చాలా ఇష్టం. తన అభిరుచిని చాటుకుంటూ అప్పుడప్పుడు ఆయా పాత్రల్లో అభిమానులను అలరిస్తుంటారు. తన 100వ చిత్రం కలకాలం గుర్తిండిపోవాలన్న ఉద్దేశంతో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజా సమాచారం ప్రకారం ఆయన మరో చారిత్రక వీరుడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అదే పాత్ర. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తర్వాత బాలయ్య ‘గోన గన్నారెడ్డి’ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. కాకతీయ రాణి రుద్రమదేవి కాలంలో గోన గన్నారెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడు. గుణశేఖర్-అనుష్క కాంబినేషన్లో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే. ‘నేను తెలుగు భాష లెక్క ఈడా ఉంటా.. ఆడా ఉంటా, గమ్మనుండవయ్యా.. అంటూ బన్నీ చెప్పిన డైలాగులు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ చారిత్రక పాత్రలో బన్నీని బాలయ్య మరిపిస్తారో? లేదో? చూడాలి. from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37LiKOa
No comments:
Post a Comment