Tuesday, October 27, 2020

25 మిలియన్ వ్యూస్... రికార్డు క్రియేట్ చేసిన ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్దే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23వ తేదీన ‘బీట్స్ ఆఫ్ ’ అంటూ మోషన్ పోస్టర్ విడుదల చేస్తూ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది యూనిట్. ఈ టీజర్ ‌అందరినీ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్‌మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 25 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌ సాధించి అత్యధిక వ్యూస్‌ సాధించిన ఇండియన్ సినిమా మోషన్‌ పోస్టర్‌గా రికార్డ్‌ను క్రియేట్‌ చేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. రొమాంటిక్ ప్రేమకథగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3e6DCRo

No comments:

Post a Comment

Self-destructing internal SSD goes live with a one-click unstoppable data destruction promise - even if the power supply is cut

Teamgroup P250Q SSD self-destruct flash circuits promise instant sanitization for high-risk data in classified deployments Hardware-level...