రామ్‌చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీన విడుదల చేసిన భీమ్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. అతి తక్కువ టైమ్‌లోనే మిలియన్ లైకులు సాధించిన ఇండియన్ సినిమాగా ఘనత సాధించింది.
అయితే టీజర్ చివర్లో కొమరం భీమ్‌ను ముస్లిం గెటప్‌లో చూపించడంతో వివాదం చెలరేగింది. రాజమౌళి ఆదివాసీల మనోభావాలు దెబ్బతీశారని, సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే రాజమౌళి ఈ వివాదాలను పట్టించుకోకుండా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఫిక్షనల్ ఇందులో సీత పాత్రలో నటించనున్న అలియా భట్ త్వరలోనే యూనిట్‌తో జత కలవనున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆమె నవంబర్ 2 నుంచి షూటింగ్‌లో పాల్గొగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీత పాత్ర చిన్నదే అయినప్పటికీ పాన్ ఇండియా కావడంతో అట్రాక్షన్ కోసం అలియా భట్‌ను తీసుకున్నారు. ఎన్టీఆర్ జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తోంది. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌తో పాటు హాలీవుడ్ నటులు రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ తదితరులు నటిస్తున్నారు. from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HJHzQ3
No comments:
Post a Comment