సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికోసం యూనిట్ అడవిలోకి ప్రవేశించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 6 నుంచి షురూ కాబోతోందని తెలుస్తోంది. ఇందుకోసం మారేడుమిల్లి ఫారెస్ట్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ కావడంతో కచ్చితంగా అడవుల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరించాల్సి ఉంది.
ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే యువకుడిగా మాస్ పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందానా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఇద్దరూ చిత్తూరు యాసలో ట్రైనింగ్ తీసుకున్నారు. మారేడుమిల్లి అడవుల్లో నెల రోజుల పాటు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా షూట్ చేయనున్నట్లు యూనిట్ చెబుతోంది. from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/320WKeu
No comments:
Post a Comment