Friday, October 2, 2020

Rajamouli: క్వారంటైన్‌లో RRR యాక్టర్స్.. ఎన్టీఆర్ తోనే మొదలు.. రాజమౌళి ప్లాన్ ఇదే!

దర్శకధీరుడు రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ RRR. యంగ్ టైగర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మేరకు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన రాజమౌళి.. కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌తో గత ఆరు నెలలుగా షూటింగ్ ఆపేశారు. అయితే ఇటీవలే తిరిగి షూటింగ్స్‌కి అనుమతి లభించినా కరోనా ఉదృతి తగ్గలేదని సెట్స్ మీదకు రాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలాఖరులో అయినా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్సయిన జక్కన్న.. అన్నీ పక్కాగా ప్లాన్ చేశారట. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి RRR నటీనటులందరినీ హోటల్స్‌లో క్వారంటైన్‌లో ఉండాలని రాజమౌళి సూచించినట్లు తెలుస్తోంది. వాళ్ళ క్వారంటైన్ పీరియడ్ అయ్యాకే షూటింగ్‌ ప్రారంభించేలా రాజమౌళి స్కెచ్ రెడీ చేశారని సమాచారం. ఒక్కసారి షూటింగ్ ప్రారంభమయ్యాక ఇబ్బందులు తలెత్తకుండా తన వంతుగా ఈ చర్యలు తీసుకుంటున్నానని టీం అందరితో చెప్పి సహకరించాలని కోరారట జక్కన్న. అలాగే షూటింగ్‌ స్పాట్‌లో ఉపయోగించే సామాగ్రిని ప్రత్యేకంగా శానిటైజేషన్‌ చేయించటం, థర్మల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయబోతున్నారట రాజమౌళి. Also Read: RRR షూటింగ్ మొదలైనప్పటి నుంచే మెగా, నందమూరి అభిమానుల్లో ఆతృత మొదలైంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసినప్పటికీ ఎన్టీఆర్ టీజర్ మాత్రం పెండింగ్ లోనే ఉంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే ఇది గమనించిన జక్కన్న.. ముందుగా ఎన్టీఆర్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. 400 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి బడా నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న RRR మూవీలో లియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cXnLnp

No comments:

Post a Comment

Goodnotes adds an AI that can read and explain even the worst handwriting

AI has become very good at holding up its end of a conversation with humans, but a set of new AI features from the digital notetaking app G...