Saturday, October 3, 2020

అల్లు అర్జున్‌ని చూడటం కోసం 200 కి.మీ కాలినడక.. డైహార్డ్ ఫ్యాన్‌ని సర్ ప్రైజ్ చేసిన బన్నీ

స్టైలిష్ స్టార్ అంటే పడిచచ్చే అభిమానులు చాలా మందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ ఇతర రాష్ట్రాల్లో కూడా బన్నీకి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించిన బన్నీ.. మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే డైహార్డ్ ఫ్యాన్‌కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తెలుగు వాళ్ల అభిమానం చూరగొనాలే కాని.. అభిమానించడం మొదలు పెడితే ప్రాణం పెట్టేస్తారు అనడానికి ఇదో ఉదాహరణ. బన్నీ అంటే పడిచచ్చిపోయే మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే యువకుడు ఎలాగైనా తన అభిమాన హీరోని కలవాలని మాచర్ల నుంచి కాలినడకన హైదరాబాద్ వచ్చేశాడు. సుమారు 250 కిలోమీటర్లు బన్నీని చూడటం కోసం నడిచే వచ్చాడు ఆ వీరాభిమాని. అల్లు అర్జున్ ఇంటి అడ్రస్‌ని కనుక్కుని ఆయన్ని కలవాలని ప్రయత్నించి చివరికి విజయం సాధించారు. తనను కలవడం కోసం వచ్చిన ఆ యువకుడ్ని ఇంటి లోపలికి సాదరంగా ఆహ్వానించి చాలాసేపు అతనితో మాట్లాడి ఫొటోలు దిగి పంపించారు అల్లు అర్జున్. సెప్టెంబర్ 17న మాచర్ల నుంచి కాలినడకన పాదయాత్ర ద్వారా బయలుదేరిన యువకుడు.. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌కి చేరుకున్నాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్‌ని కలవడం కోసం ప్రయత్నిస్తుండగా.. ఎట్టకేలకు అతని కల నెలవేర్చారు అల్లు అర్జున్. ఈ డైహార్డ్ ఫ్యాన్‌ అల్లు అర్జున్‌ని కలిసిన ఫొటోలను మెగా పీఆర్ఓ ఏలూరు శ్రీను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36te2Ek

No comments:

Post a Comment

Poco F7 Global Variant Reportedly Spotted on EEC Certification Site, Expected to Launch Soon

Poco F7 has been the subject of numerous rumours in recent weeks, alongside the speculated Poco F7 Pro and Poco F7 Ultra variants. Earlier r...