ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు . తన తర్వాతి చిత్రం ఎన్టీఆర్‌తో తీయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులన్నీ తారుమారు కావడంతో ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగులో బిజీగా ఉండటం, అది పూర్తవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుండటంతో త్రివిక్రమ్ ఆలోచనలో పడ్డారంట. ఎన్టీఆర్ కోసం అన్ని రోజులు తాను ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి తెలుస్తోంది. ఈ టైమ్‌లో ఓ యంగ్ హీరోతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని. Also Read: ప్రస్తుతం ఆయన నటించిన ‘రెడ్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి తోడు ఆయన వేరే ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. దీంతో త్రివిక్రమ్, రామ్ కాంబినేషన్ ఓకే అయిపోయినట్లేనని, దీనికి సంబంధించి కొద్దిరోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని ఫిల్మ్‌నగర్ టాక్. అప్పట్లో వరుస ప్లాపులతో సతమతమైన రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో కరువు మొత్తం తీర్చుకున్నాడు. ‘రెడ్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. Also Read:from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oudEM9
No comments:
Post a Comment