టాలీవుడ్‌లో ఇటీవల కొందరు హీరోలు పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి ప్రవేశించినా.. ఇంకా కొందరు హీరోలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా చెలామణి అవుతున్నారు. అలాంటి వారిలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఒకరు. ఇటీవలే 35వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన ఎక్కడికెళ్లినా పెళ్లెప్పుడు అన్న ప్రశ్నే ఎదురవుతోంది. ఇటీవల ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పిన మేనమామ చిరంజీవి.. ‘సోలో లైఫ్ ఇంకొన్ని రోజులే.. ఎంజాయ్ చేయ్’ అంటూ సెటైర్ వేశారు. దీంతో తేజ్ తర్వలోనే పెళ్లి పీటలెక్కడం ఖాయమన్న అభిప్రాయానికి ఫ్యాన్స్ వచ్చేశారు. Also Read: ఈ నేపథ్యంలోనే పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేశాడు సాయిధరమ్ తేజ్. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అయితే పెళ్లిపై తనకు ఆసక్తి లేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేసేయాలని నిర్ణయానికి వచ్చేశారు. వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక సంబంధాలు చూడమని చెప్పా. అంతకుమించి పెళ్లిపై నాకెలాంటి ఇంట్రస్ట్ లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా’ అంటూ క్లారిటీ ఇచ్చాడు తేజ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dXIrwf
No comments:
Post a Comment