Friday, October 2, 2020

కరెన్సీపై బాపు ఓ డిజైన్! సెలవిస్తారు కానీ మందు దొరకదు.. గాంధీ జయంతిపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్

భారత దేశ ప్రజానీకాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్పవ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు. గాంధీయిజం ప్రపంచానికే పాఠమైంది. సత్యాగ్రహం, అహింస గాంధీ అనుసరించిన విధానాలు. భారత దేశ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని అందించిన మహానుభావుడిని జాతిపితగా కీర్తిస్తూ ప్రతి ఏడాది గాంధీ జయంతిని అక్టోబర్ 2న జరుపుకుంటాం. ఆ రోజు దేశం మొత్తానికి సెలవు దినం. పైగా ఆల్కహాల్ నిషేదిత రోజు. దేశమంతా గాంధీ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పిస్తుంటారు. ఈ క్రమంలో గాంధీ జయంతిపై చేసిన తాజా ట్వీట్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ''ఆడది అర్ధరాత్రి నిర్భయంగా బయట తిరగ గలిగినప్పుడు దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని చెప్పారు బాపు. మరి పట్టపగలు కూడా రేపులు జరుగుతుంటే సంవత్సరానికి ఓసారి సెలవిచ్చి శుభాకాంక్షలు చెప్పుకోవడంలో అర్థమేముంది?'' అని ట్వీట్ చేసిన మంచు మనోజ్.. దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ''మనకు బాపు కరెన్సీ మీద ఒక డిజైన్. ప్రతి ఏడాది ఒక రోజు సెలవిచ్చే వారం. ఆ రోజు మందు దొరకకుండా చేసే ఒక శాపం.. అంతేగా??? మారుదాం బాస్.. ప్లీజ్'' అంటూ గాంధీ జయంతి హ్యాష్ ట్యాగులు పోస్ట్ చేశారు. Also Read: దేశంలో పట్టపగలే అత్యాచారాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. వాటిని ఖండిస్తూ మంచు మనోజ్ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్‌లో జరిగిన ఘటన దేశంలో ప్రకంపనలు రేపుతోంది. ఉన్నత కులాలకు చెందిన నలుగురు వ్యక్తులు దళిత యువతిపై లైంగిక దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కాగా బాధితురాలిపై అఘాయిత్యం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక బయటకు రావడంతో అంతా విస్మయానికి లోనయ్యారు. ఈ ఘటన నేపథ్యంలోనే మనోజ్ ఘాటుగా ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ldAMwd

No comments:

Post a Comment

This AI tool lets you confront your future self – and you might like what you find

Imagining what you'll be like in the future is a common game for kids, full of the sometimes unlikely hopes and fears we all feel when ...