ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్లతో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగాడు . ఆ తర్వాత ట్రెండ్‌కు తగ్గట్లుగా మారకపోవడంతో భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. అవకాశాలు రాక ఎదురుచూస్తున్న సమయంలో రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150కి ఛాన్స్ ఇవ్వడంతో ఆయన దశ తిరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించినా వినాయక్ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అట్టర్ ప్లాపులు కావడంతో ఆయనకు అవకాశాలు ఇచ్చేవారే కరువయ్యారు. Also Read: ఈ నేపథ్యంలోనే మళ్లీ మెగాస్టార్ చిరంజీవి ఆపద్భాందవుడిగా ఆయన్ని ఆదుకున్నారు. మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కెరీర్లో ఠాగూర్ ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. ఆ నేపథ్యంలో వినాయక్‌ను అంటే చిరంజీవి ఎంతో అభిమానిస్తుంటారు. అందువల్లే వినాయక్‌కు ఆదుకోవాలన్న ఉద్దేశంతో మరో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి తోడు రీమేక్ సినిమాలు చేయడంతో ఆయన దిట్ట కావడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. అసలు విషయానికొస్తే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లకముందే ఆయన్ని ముఖ్యమంత్రిగా ఊహించుకుని వినాయక్ ఓ కథ రెడీ చేసుకున్నారట. ఠాగూర్ సినిమా తర్వాత చిరుతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారట. అయితే ఆ ప్రాజెక్టు ముందుకెళ్లేలా కనిపించకపోవడంతో కొంత భాగాన్ని ఠాగూర్ సినిమా కోసం వాడుకున్నానని వినాయక్ తెలిపారు. చిరంజీవి రాజకీయాల్లో వెళ్తారని అప్పట్లో ప్రచారం జరిగేది. చిరు రాజకీయ ప్రవేశానికి బూస్టప్ ఇచ్చేలా కథ రాసుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడం తన మనసుకు బాధ కలిగిందని వినాయక్ చెప్పారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో మహేష్, పవన్ కళ్యాణ్‌లతో సినిమాలు చేయకపోవడం కూడా తన కలగా మిగిలిపోయిందన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HiXsg7
No comments:
Post a Comment